Breaking News

ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..


Published on: 09 Dec 2025 12:25  IST

మరోసారి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. US వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు పేలకూడదంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు.. ఐసోలేషన్‌ బే దగ్గర ఫ్లైట్‌ని ఉంచి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఆ అనుమానాస్పద మెయిల్ న్యూయార్క్‌ నుంచి వచ్చినట్టు నిర్ధారించారు. ఎలాంటి ముప్పూ లేదని సెక్యూరిటీ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి