Breaking News

క్విక్‌ కామర్స్‌పై ఫోకస్‌.. స్విగ్గీ నష్టం డబుల్‌


Published on: 09 May 2025 21:50  IST

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,018.18 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్విక్‌ కామర్స్‌ విభాగం, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ మీద పెట్టుబడులు పెరిగి నష్టాలను పెంచాయని కంపెనీ తెలిపింది. ఆదాయం రూ.3,045.5 కోట్ల నుంచి రూ.4,410 కోట్లకు పెరిగింది, అయితే ఖర్చులు రూ.3,668 కోట్ల నుంచి రూ.5,609.6 కోట్లకు చేరాయి. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ ఆర్డర్‌ విలువ 13.3% పెరిగి రూ.526కు చేరిందని, 316 కొత్త డార్క్‌ స్టోర్లు తెరిచినట్లు పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి