Breaking News

శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు


Published on: 09 May 2025 22:34  IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ ద్వారా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్‌, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. ఇది ఫేక్ బెదిరింపా? ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది. భారత్-పాక్‌ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై విమానాశ్రయ భద్రతను మరింత బలపరిచారు, ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా చర్యలు కొనసాగిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి