Breaking News

డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.1,593 కోట్ల లాభం


Published on: 10 May 2025 22:20  IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 2023-24 నాలుగో త్రైమాసికంలో రూ.8,506 కోట్ల ఆదాయంతో రూ.1,593 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఇది గత ఏడాది తో పోలిస్తే ఆదాయం 20%, లాభం 22% పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం వార్షిక ఆదాయం రూ.32,553 కోట్లు, నికరలాభం రూ.5,654 కోట్లు కాగా, వీటిలో వరుసగా 17% మరియు 2% వృద్ధి కనిపించింది. ఉత్తర అమెరికా ఆదాయం 12%, ఐరోపా ఆదాయం 75% పెరిగాయి. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని, కొత్త ఔషధాల విడుదల, అమెరికా అమ్మకాల వృద్ధి ప్రధాన కారణాలని కో-ఛైర్మన్ జీవీ ప్రసాద్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి