Breaking News

వన్డే సిరీస్‌.. విజేతగా భారత్‌


Published on: 11 May 2025 18:31  IST

దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌ మధ్య జరిగిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా టీమ్‌ఇండియా నిలిచింది. సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 343 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో చమరి ఆటపట్టు (51) అర్ధశతకం సాధించింది. నీలాక్షి(48), విష్మి(36) రాణించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 4, అమన్‌జ్యోత్‌ 3 వికెట్లు తీశారు.

Follow us on , &

ఇవీ చదవండి