Breaking News

ఇళ్లకు అప్పుడే రావొద్దు..: సరిహద్దు గ్రామాల ప్రజలకు అడ్వైజరీ


Published on: 11 May 2025 19:03  IST

భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలకు జమ్మూకశ్మీర్‌ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అనంతరం పాకిస్థాన్‌ దుశ్చర్యల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్థాన్‌ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు (షెల్స్‌)నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి