Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్ 


Published on: 07 Nov 2025 18:34  IST

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను విక్కీ కౌశల్ నవంబర్ 7, 2025న తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అధికారికంగా ప్రకటించారు. తమ పోస్ట్‌లో, "మా జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. మా బేబీ బాయ్ జన్మించాడు. మా జీవితాల్లోకి వచ్చిన ఈ చిన్న మిరాకిల్‌కి మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం," అని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ సంతోషకరమైన వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి