Breaking News

తాజా పిటిషన్లకు సుప్రీం నిరాకరణ


Published on: 30 Apr 2025 16:07  IST

వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగబద్ధతపై దాఖలైన తాజా పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం విచారించకుండా తిరస్కరించింది. ఇప్పటికే ఉన్న కేసులకు మరిన్ని జతచేయడం కష్టతరమవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం స్పష్టం చేశారు.అయితే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాలు చేసేందుకు అదనపు కారణాలు ఉంటే ప్రధాన పిటిషన్లో జోక్యం చేసుకోవచ్చని ఫిరోజ్‌ ఇక్బాల్‌ ఖాన్, ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢి, షేక్‌ మునీర్‌ అహ్మద్, ముస్లిం న్యాయవాదుల సంఘానికి సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి