Breaking News

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

మార్చి 3, 2026న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.


Published on: 03 Mar 2026 10:59  IST

మార్చి 3, 2026న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలు (రెండేళ్ల కుమారుడు మరియు 10 నెలల పసిబిడ్డ).భర్త మేకల మహేశ్ యాదవ్‌తో గత కొంతకాలంగా ఉన్న కుటుంబ కలహాలు, మనస్పర్థలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.విభేదాల కారణంగా పుట్టింటికి వెళ్ళిన ఐశ్వర్యను కుటుంబ సభ్యులు సోమవారం అత్తారింట్లో వదిలివెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె తన ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి చంపి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి