Breaking News

సూరారం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

హైదరాబాద్‌లోని సూరారం పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం (3 మార్చి 2026) చోటుచేసుకుంది


Published on: 03 Mar 2026 18:55  IST

హైదరాబాద్‌లోని సూరారం పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం (3 మార్చి 2026) చోటుచేసుకుంది. మరణించిన యువకులను సాగర్అభిషేక్ అని గుర్తించారు.మంగళవారం కావడంతో వీరు సరదాగా ఈత కొట్టడానికి సూరారంలోని పంతులు చెరువు వద్దకు వెళ్లారు.

ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి