Breaking News

మందమర్రిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా మందమర్రిలో 2026, మార్చి 8 ఆదివారం ఉదయం ఒక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది.


Published on: 09 Mar 2026 17:13  IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలో 2026, మార్చి 8 ఆదివారం ఉదయం ఒక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది.మృతుడిని మందమర్రి అంగడి బజార్‌కు చెందిన క్యాతం తనయ్ (16) గా గుర్తించారు. అతను స్థానిక సింగరేణి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.

ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.పరీక్షల ఒత్తిడి మరియు చదువుపై శ్రద్ధ పెట్టమని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌లో, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయనే భయం మరియు తండ్రి కోప్పడటం వల్ల కృంగుబాటుకు గురైనట్లు పేర్కొన్నాడు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి