Breaking News

వెనుక నుండి ఢీకొట్టిన లారీ ఇద్దరూ మృతి

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద నేడు (మార్చి 10, 2026) తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. 

Published on: 10 Mar 2026 10:23  IST

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద నేడు (మార్చి 10, 2026) తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. 

మార్చి 10, 2026, తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.వెనుక నుండి తమ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగేందుకు బస్సు డ్రైవర్, క్లీనర్ కిందకు దిగారు.వారు లారీ డ్రైవర్‌తో ఘర్షణ పడుతున్న సమయంలో, వెనుక నుండి అతివేగంతో వచ్చిన మరో లారీ వీరిద్దరినీ బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి