Breaking News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై గురువారం (7 మే 2024) దాడి జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయన డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Published on: 07 May 2026 14:16  IST

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై గురువారం (7 మే 2024) దాడి జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయన డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కరీంనగర్‌లోని మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆయన కారుపై కర్రలతో దాడి చేసి, అద్దాలను ధ్వంసం చేశారు.అంతకుముందు బండి సంజయ్.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ ఇస్తూ, సంజయ్‌కే డ్రగ్స్ అలవాటు ఉందని, తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ గొడవకు దారితీశాయి.ఈ ఘటనతో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow us on , &

ఇవీ చదవండి