Breaking News

కామారెడ్డిలో కవలలనే పెళ్లాడిన కవలలు

2026 ఫిబ్రవరి 23న కామారెడ్డి  జిల్లాలో ఒక అరుదైన వివాహ వేడుక జరిగింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం (World Twins Day) సందర్భంగా ఇద్దరు కవల సోదరులు, ఇద్దరు కవల సోదరీమణులను ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు. 

Published on: 23 Feb 2026 18:45  IST

2026 ఫిబ్రవరి 23న కామారెడ్డి  జిల్లాలో ఒక అరుదైన వివాహ వేడుక జరిగింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం (World Twins Day) సందర్భంగా ఇద్దరు కవల సోదరులు, ఇద్దరు కవల సోదరీమణులను ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు. 

తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి, సాయన్నల కవల కుమార్తెలు కీర్తనకీర్తి వధువులుగా; భిక్కనూరు మండలం ఘన్‌పూర్  గ్రామానికి చెందిన విజయ్వినయ్ వరులుగా ఈ వేడుకలో ఒక్కటయ్యారు.

ఈ వివాహం కామారెడ్డి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది.కవలలు కవలలనే పెళ్లి చేసుకోవడం, అది కూడా కవలల దినోత్సవం రోజే జరగడం విశేషం అని స్థానికులు చర్చించుకున్నారు. ఈ అరుదైన వివాహాన్ని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి