Breaking News

కారేపల్లిలో కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ నాయకుల ర్యాలీ

ఖమ్మం జిల్లా కారేపల్లిలో మే 20, 2026 (బుధవారం) నాడు మెడికల్ షాపుల బంద్ సంపూర్ణంగా కొనసాగింది.


Published on: 20 May 2026 16:21  IST

ఖమ్మం జిల్లా కారేపల్లిలో మే 20, 2026 (బుధవారం) నాడు మెడికల్ షాపుల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఆన్‌లైన్ ఈ-ఫార్మసీల విక్రయాలను, కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో తీసుకువచ్చిన జీవో నంబర్ 817ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ దేశవ్యాప్త సమ్మె జరిగింది.

కారేపల్లి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని మెడికల్ దుకాణాలన్నింటినీ యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.రెండు రోజుల ముందే సమాచారం రోగులకు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అత్యవసర మందులను ముందే కొనుగోలు చేసుకోవాలని నిర్వాహకులు రెండు రోజుల క్రితమే విస్తృతంగా ప్రచారం చేశారు.

కారేపల్లి ప్రధాన కూడలిలో స్థానిక కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి, నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ నిరసనలో సంఘం నాయకులు ఓరుగంటి రంగనాథ్, అనంతరపు వెంకటాచారి, పోలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి