Breaking News

ధాన్యం కుప్పకారణంగా ప్రమాదం యువతి మృతి

నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రం శివారులో 2026, ఏప్రిల్ 28న రోడ్డుపై పోసిన ధాన్యం కుప్ప కారణంగా జరిగిన ప్రమాదంలో దేవిరెడ్డి (23) అనే యువతి మృతి చెందింది. 


Published on: 29 Apr 2026 19:12  IST

నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రం శివారులో 2026, ఏప్రిల్ 28న రోడ్డుపై పోసిన ధాన్యం కుప్ప కారణంగా జరిగిన ప్రమాదంలో దేవిరెడ్డి (23) అనే యువతి మృతి చెందింది. 

నిజామాబాద్ పట్టణంలోని నాందేవ్ వాడకు చెందిన దేవిరెడ్డి, తన సోదరితో కలిసి మోస్రాలో ఒక శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఎదురుగా వాహనం రావడంతో తప్పించుకునే క్రమంలో, రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పపైకి వారి స్కూటీ ఎక్కి అదుపు తప్పింది.

వెనుక కూర్చున్న దేవిరెడ్డి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ, రైతులు రోడ్లపైనే కుప్పలు పోస్తుండటం వల్ల ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి