Breaking News

విశాఖ నుంచి అదనంగా వందే భారత్ డిమాండ్

విశాఖపట్నం నుంచి అదనంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు.


Published on: 14 Jan 2026 16:11  IST

విశాఖపట్నం నుంచి అదనంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జనవరి 14, 2026న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు.  విశాఖపట్నం విమానాశ్రయ కార్యకలాపాలు జూన్-జులై 2026 నాటికి భోగాపురానికి మారుతున్నాయని, సరైన రోడ్డు సౌకర్యాలు లేని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి విజయవాడకు విమానంలో వెళ్లడం కంటే, వందే భారత్ రైలులో విజయవాడకు వెళ్లడమే సులభమని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై నగరాలకు అదనంగా వందే భారత్ రైళ్లు అవసరమని ఆయన కోరారు.

ఈ విషయంలో విశాఖ ఎంపీ భరత్ చొరవ తీసుకుని కనీసం రెండు అదనపు వందే భారత్ రైళ్లను సాధించాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశాఖ-విజయవాడ సెక్టార్‌లో రాబోయే రోజుల్లో రైళ్ల అవసరం మరింత పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. 

Follow us on , &

ఇవీ చదవండి