Breaking News

రైలులో టికెట్ లేని వ్యక్తి హలచల్

ఏప్రిల్ 29, 2026 బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్‌లో టికెట్ లేని ఒక ప్రయాణికుడు పెను అలజడి సృష్టించాడు.


Published on: 29 Apr 2026 17:44  IST

ఏప్రిల్ 29, 2026 బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్‌లో టికెట్ లేని ఒక ప్రయాణికుడు పెను అలజడి సృష్టించాడు. ఈ ఘటన ధర్మవరం నుంచి నరసాపురం వెళ్లే ధర్మవరం-నరసాపురం ఎక్స్‌ప్రెస్ (17248) లో చోటుచేసుకుంది.బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో రైలు గుడివాడ జంక్షన్‌కు చేరుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో టికెట్ తనిఖీ చేస్తున్న టీసీ (TC) ని చూసి, టికెట్ లేని ఒక వ్యక్తి భయంతో రైలు కిటికీ గుండా బయటకు దూకి, నేరుగా రైలు పైకప్పు (Roof) పైకి ఎక్కాడు.రైల్వే పోలీసులు, సిబ్బంది ఎంత చెప్పినా అతను కిందకు దిగకుండా పైన అటు ఇటు తిరుగుతూ హంగామా చేశాడు. హై-వోల్టేజ్ విద్యుత్ వైర్లు (OHE wires) సమీపంలో ఉండటంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.చివరికి రైల్వే పోలీసులు మరియు స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకుని కిందకు దించారు. 

Follow us on , &

ఇవీ చదవండి