Breaking News

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి

2026 ఏప్రిల్ 28న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 


Published on: 28 Apr 2026 17:07  IST

2026 ఏప్రిల్ 28న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన ఏప్రిల్ 28 (మంగళవారం) ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర మరియు ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు.టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.ప్రధాన ఆలయంతో పాటు ఆయన బేడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి