Breaking News

అక్షయ తృతీయకు బంగారం కొనుగోళ్ల జోరు

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు జనం మొగ్గు చూపుతుండగా, దుకాణాల్లో ప్రత్యేక ఆఫర్లతో సందడి నెలకొంది.


Published on: 17 Apr 2026 18:36  IST

అక్షయ తృతీయ సమీపిస్తుండటంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజున పసిడి కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందనే నమ్మకంతో దుకాణాల వద్ద రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని జ్యువెలరీ షాపులు ముందుగానే ముస్తాబై, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 

ఈ నెల 10 నుంచి 20 వరకు పలు దుకాణాలు రాయితీలు ప్రకటించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, భవిష్యత్‌లో తిరిగి విక్రయించగలమనే భరోసాతో ప్రజలు పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తున్నారు. కొందరు పాత నగలను ఎక్స్ఛేంజ్ చేసి కొత్త డిజైన్లను ఎంచుకుంటుండగా, మరికొందరు అక్షయ తృతీయ రోజున డెలివరీ తీసుకునేలా ముందుగానే బుకింగ్ చేస్తున్నారు. 

దుకాణదారులు మేకింగ్ ఛార్జీలు తగ్గించడం, గోల్డ్ కాయిన్ ఆఫర్లు వంటి పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వినియోగదారులు ఆఫర్లను పరిశీలించి, నిజమైన ప్రయోజనం ఉన్నదే ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనుగోలు చేయడం, సరైన బిల్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం అవసరం. 

అక్షయ తృతీయ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేసే సమయంలో, ధరలు, ఆఫర్లు, నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తే కొంతమేర ఆదా చేసుకునే అవకాశం ఉంది.  

Follow us on , &

ఇవీ చదవండి