Breaking News

బైక్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి (16 ఏప్రిల్, 2026) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.


Published on: 17 Apr 2026 19:09  IST

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి (16 ఏప్రిల్, 2026) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. 

మృతులను గబ్బిలాల్‌పేట్‌కు చెందిన కనకరాజు (22) మరియు అరుణ్ (20) గా పోలీసులు గుర్తించారు.వీరు జవహర్‌నగర్‌లో వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి తమ స్నేహితులతో కలిసి రెండు బైక్‌లపై యాద్గార్‌పల్లి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో యాద్గార్‌పల్లి చౌరస్తా సమీపంలోని ఒక మలుపు వద్ద బైక్ అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొట్టింది.ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి