Breaking News

CCS PS గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా​​​​​​​ గుడివాడలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (CCS PS)గోదాంలో నేడు (ఫిబ్రవరి 18, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది.


Published on: 18 Feb 2026 18:17  IST

కృష్ణా జిల్లా గుడివాడలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (CCS PS)గోదాంలో నేడు (ఫిబ్రవరి 18, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు చెందిన గోదాంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, మద్యం సీసాలు, మరియు ఇతర స్వాధీనం చేసుకున్న వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

గోదాంలో నిల్వ ఉంచిన దీపావళి టపాసులు, గ్యాస్ సిలిండర్లు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎస్పీ ధీరజ్ వినీల్ విచారణకు ఆదేశించారు.ఈ పోలీస్ స్టేషన్ భవనం సమీపంలోనే తహసీల్దార్ కార్యాలయం, ట్రెజరీ వంటి ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. 

Follow us on , &

ఇవీ చదవండి