Breaking News

విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్నేడు (మార్చి 5, 2026) గుంటూరులోని దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారు. 

Published on: 05 Mar 2026 11:51  IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్నేడు (మార్చి 5, 2026) గుంటూరులోని దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారు. 

మార్చి 5వ తేదీలోపు విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో సునీల్ నాయక్‌ను ఆదేశించింది.ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.

తదుపరి విచారణ జరిగే వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.2021లో రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను కస్టడీలో హింసించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అప్పట్లో సునీల్ నాయక్ ఏపీ సీఐడీలో డీఐజీగా పనిచేశారు.ఈ కేసుపై హైకోర్టులో తదుపరి విచారణ మార్చి 9, 2026న జరగనుంది. 
 
Follow us on , &

ఇవీ చదవండి