Breaking News

తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన ముఠాఅరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠానుముదినేపల్లి పోలీసులు సోమవారం (మార్చి 9, 2026) అరెస్ట్ చేశారు.


Published on: 09 Mar 2026 18:18  IST

పశ్చిమ గోదావరి జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠానుముదినేపల్లి పోలీసులు సోమవారం (మార్చి 9, 2026) అరెస్ట్ చేశారు. వీరు తాళం వేసిన ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదు మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించేవారు.

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ నేతృత్వంలోని ముదినేపల్లి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.జల్సాల కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. 

ఇటీవలే ఇళ్ల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని మరియు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి