Breaking News

ఆస్తి తగాదాల కారణంగా తండ్రి దారుణహత్య

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 1 ఏప్రిల్ 2026న ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా కన్నతండ్రిని భార్య మరియు కుమారుడే చంపినట్లు సమాచారం.


Published on: 01 Apr 2026 19:06  IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 1 ఏప్రిల్ 2026న ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా కన్నతండ్రిని భార్య మరియు కుమారుడే చంపినట్లు సమాచారం. జహీరాబాద్‌లోని భరత్ నగర్ తాజుద్దీన్(60), వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లి నివాసి. ఇతడు జహీరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.కొంతకాలంగా సాగుతున్న ఆస్తి పంపకాల గొడవలు.నిందితులు ముందుగా తాజుద్దీన్ కళ్లలో కారం చల్లి, ఆపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

జహీరాబాద్ సీఐ శివలింగం, ఎస్సై వినయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి