Breaking News

తిప్పర్తిలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం సమీపంలో 2026, ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టాలపైకి వచ్చిన గేదెను రైలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. 

Published on: 09 Apr 2026 15:12  IST

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం సమీపంలో 2026, ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టాలపైకి వచ్చిన గేదెను రైలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. 

సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12747/12748) తిప్పర్తి సమీపంలో పట్టాలు దాటుతున్న ఒక గేదెను బలంగా ఢీకొట్టింది.ఢీకొన్న ధాటికి గేదె మృతి చెంది, దాని కళేబరం రైలు ఇంజిన్ చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. దీనివల్ల ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి రైలు అక్కడే నిలిచిపోయింది.అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు.ఈ ఘటన కారణంగా నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వందే భారత్, జన్మభూమి, ఇంటర్‌సిటీ వంటి పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. 

Follow us on , &

ఇవీ చదవండి