Breaking News

దక్షిణాది ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తన 43వ పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

దక్షిణాది ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తన 43వ పుట్టినరోజు సందర్భంగా నేడు (మే 4, 2026, సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు


Published on: 04 May 2026 13:58  IST

దక్షిణాది ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తన 43వ పుట్టినరోజు సందర్భంగా నేడు (మే 4, 2026, సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.తన అభిమాన నటిని చూడటానికి భక్తులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.

నేడు ఆమె పుట్టినరోజు మాత్రమే కాకుండా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సన్నిహితుడు మరియు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ విజయం సాధించాలని ఆమె ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి