Breaking News

జడ్చర్లలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై నిన్న (బుధవారం) అర్ధరాత్రి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బలంగా ఢీకొన్నాయి.


Published on: 28 May 2026 16:14  IST

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై నిన్న (బుధవారం) అర్ధరాత్రి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బలంగా ఢీకొన్నాయి.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సును, బెంగళూరు వైపు వెళ్తున్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ కుమారుడు అశోక్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.అతివేగం మరియు డ్రైవర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి