Breaking News

యూట్యూబ్ చూసి హత్యాకు స్కెచ్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో యూట్యూబ్‌లో హత్య ఎలా చేయాలో చూసి, ఒక వ్యక్తిని దారుణంగా అంతమొందించిన కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.


Published on: 30 Jun 2026 15:15  IST

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో యూట్యూబ్‌లో హత్య ఎలా చేయాలో చూసి, ఒక వ్యక్తిని దారుణంగా అంతమొందించిన కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామ సమీపంలో జూన్ 27 రాత్రి జరిగిన పాటూరి మొగిలి హత్య కేసు వివరాలను జమ్మికుంట పోలీసులు వెల్లడించారు.

హత్యకు గల కారణాలు

పోలీసుల విచారణ ప్రకారం, నిందితుడు మహేష్‌కు ఒక వివాహితతో అక్రమ సంబంధం ఉంది. గతంలో సదరు మహిళపై మొగిలి అత్యాచార యత్నానికి పాల్పడగా, మహేష్ ఆమెకు మద్దతుగా నిలిచి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. అయితే, ఆ కేసు తర్వాత కూడా మొగిలి నిరంతరం మహేష్‌ను, ఆ మహిళను సమాజంలో కించపరుస్తూ మాట్లాడటంతో, మహేష్ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. మొగిలిని ఎలాగైనా ప్రాణాలతో లేకుండా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.హత్య చేయడానికి, పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి మహేష్ సరికొత్త ప్లాన్ యూట్యూబ్ స్కెచ్ వేశాడు.

హత్య జరిగిన తీరు

జూన్ 27వ తేదీ రాత్రి, మొగిలి సైకిల్‌పై ఒంటరిగా అంకుశాపూర్ రోడ్డు గుండా ఇంటికి వస్తుండగా మహేష్ బైక్‌పై వచ్చి మాటు వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఇనుప రాడ్‌తో మొగిలిపై విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడికక్కడే ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి పరారయ్యాడు. జూన్ 28న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తు - దొరకబెట్టిన డిజిటల్ ఆధారాలు

హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట నిందితుడు బుకాయించినప్పటికీ, పోలీసులు అతని మొబైల్ ఫోన్ యొక్క యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. హత్యకు ముందు అతను చేసిన సెర్చ్ హిస్టరీయే ఈ కేసులో బలమైన సాక్ష్యంగా మారింది. నిందితుడి సమాచారంతో హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న దుస్తులు, సెల్‌ఫోన్ మరియు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement