Breaking News

హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు

హరియాణాలోని గురుగ్రామ్‌లో జూలై 10, 2026న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ ముఠాకు చెందిన షూటర్లుగా పోలీసులు వీరిని గుర్తించారు.


Published on: 10 Jul 2026 10:34  IST

హరియాణాలోని గురుగ్రామ్‌లో జూలై 10, 2026న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ ముఠాకు చెందిన షూటర్లుగా పోలీసులు వీరిని గుర్తించారు.

గురుగ్రామ్‌లోని పోష్ ఏరియా అయిన సుశాంత్ లోక్ ఫేజ్-2 (Sushant Lok Phase-2) ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి.గురుగ్రామ్‌కు చెందిన ఎస్‌జీటీ (SGT) యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన విశాల్ బెర్రీని బెదిరించి ఈ ముఠా భారీగా వసూళ్లకు (Extortion) పాల్పడింది. గురువారం రాత్రి వీరు ఒక నల్లటి స్కార్పియో కారులో వచ్చి సదరు వ్యాపారవేత్త నివాసంపై అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారు.సమాచారం అందుకున్న గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను చుట్టుముట్టారు. పోలీసులపైకి కూడా దుండగులు కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.ఇరువర్గాల మధ్య దాదాపు 60 రౌండ్లకు పైగా హోరాహోరీగా బుల్లెట్ల వర్షం కురిసింది.

పోలీసుల కాల్పుల్లో ఐదుగురు గ్యాంగ్‌స్టర్లకు బుల్లెట్ గాయాలవ్వగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఆపరేషన్‌లో ముగ్గురు గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు సిబ్బంది కూడా బుల్లెట్ గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

స్వాధీనం చేసుకున్నవి: ఘటనా స్థలం నుండి పోలీసులు ఐదు ఆటోమేటిక్ పిస్తోళ్లను (వీటిలో మూడు విదేశీ తయారీవి) మరియు వారు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలాన్ని సీజ్ చేసి, ఫోరెన్సిక్ బృందాల సహాయంతో తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి