Breaking News

చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య

హైదరాబాద్ చార్మినార్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత (52) ఆదివారం (జులై 12, 2026) సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బృందావన్ కాలనీలో ఉన్న తమ నివాసంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published on: 13 Jul 2026 10:16  IST

హైదరాబాద్ చార్మినార్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత (52) ఆదివారం (జులై 12, 2026) సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బృందావన్ కాలనీలో ఉన్న తమ నివాసంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత.సికింద్రాబాద్, అల్వాల్ పరిధిలోని బృందావన కాలనీలో ఉన్న వారి స్వగృహం.ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాలు మరియు అనారోగ్య సమస్యల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు.సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె మరణానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement