Breaking News

ప్రియుడితో కలిసి ఆరేళ్ల కొడుకును హతమార్చిన తల్లి.


Published on: 07 May 2025 18:40  IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మాధవి, ప్రియుడు బాలకృష్ణతో కలిసి కుమారుడు ఆరుష్‌పై దాడి చేశారు.అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం.బాలుడిపై తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు బాలుణ్ణి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరుష్ తుదిశ్వాస విడిచాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి