Breaking News

అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు

అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో భూప్రకంపనలు


Published on: 05 Jan 2026 10:16  IST

ఈశాన్య భారతదేశంలో భూకంపాలు మరోసారి ఆందోళన కలిగించాయి. సోమవారం తెల్లవారుజామున అస్సాం రాష్ట్రంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని భూప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.

దాదాపు అదే సమయంలో త్రిపుర రాష్ట్రంలో కూడా స్వల్ప స్థాయి భూకంపం సంభవించింది. త్రిపురలోని గోమతి ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైందని, భూకంప కేంద్రం భూమికి సుమారు 54 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. త్రిపురతో పాటు పొరుగున ఉన్న మేఘాలయ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం అందింది.

అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

భూకంపాలకు తరచూ లోనయ్యే ఈశాన్య ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి