Breaking News

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలుగు మూలాలున్న నికిత గోడిశాల (27) అనే యువతి దారుణ హత్యకు గురైంది. నికిత గోడిశాల తెలంగాణకు చెందిన యువతి


Published on: 05 Jan 2026 10:34  IST

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలుగు మూలాలున్న నికిత గోడిశాల (27) అనే యువతి దారుణ హత్యకు గురైంది. నికిత గోడిశాల తెలంగాణకు చెందిన యువతి. ఈమె కొలంబియాలోని ఎల్లికాట్ సిటీలో నివసిస్తూ, 'వేద హెల్త్' (Vheda Health) అనే సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.డిసెంబర్ 31, 2025 రాత్రి 7 గంటల ప్రాంతంలో నికిత హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. నికిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నికిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడు జనవరి 2న నికిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, అదే రోజు విమానంలో భారత్‌కు పారిపోయాడు.

నికిత ఆచూకీ కోసం పోలీసులు వెతకగా, జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది.మేరీల్యాండ్ పోలీసులు అర్జున్ శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్య కేసులు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి అమెరికా పోలీసులు ఫెడరల్ అధికారుల సహాయంతో గాలిస్తున్నారు.వాషింగ్టన్ డి.సి.లోని భారత రాయబార కార్యాలయం నికిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి