Breaking News

ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన బావ!

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో దారుణ ఘటన చోటుచేసుకుంది.


Published on: 12 May 2025 11:58  IST

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం చింతపల్లి క్యాంపులో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ పరస్పర విభేదాలు ఇద్దరి జీవితాలను బలి తీసుకున్నాయి. భార్యతో తలెత్తిన గొడవ నేపథ్యంలో ఆమె సోదరులు మదిలో రగిలిన ఆవేదనతో బావతో వాగ్వివాదానికి దిగారు. ఇది క్షణాల్లో పెద్ద గొడవగా మారింది.

ఈ దాడిలో బావ అయిన గెన్ను, తన ఇద్దరు బావమర్దులు కిముడు కృష్ణ, కిముడు రాజులను శూలంతో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. వారిని అడ్డుకోబోయిన మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

మృతుల దేహాలను పోస్ట్‌మార్టం కోసం సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి