Breaking News

బీసీసీఐ ప్రకటించిన నూతన కాంట్రాక్ట్ జాబితా – ఎవరు ఏ గ్రేడ్‌లో ఉన్నారో...?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుష ఆటగాళ్లకు సంబంధించిన కీలక ప్రకటన. వేతనాలకు, వార్షిక ఒప్పందాలకు సంబంధించి కీలక ప్రకటన.


Published on: 21 Apr 2025 17:43  IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజా పురుషుల వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఇందులో పలువురు స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో అత్యున్నత గ్రేడ్ అయిన A+ కేటగిరీలో నాలుగు మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లతోపాటు జడేజా, బుమ్రా కూడా ఉన్నారు.

ఇక శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు గతంలో జాబితాలో లేకపోయినా, ఈసారి మళ్లీ కాంట్రాక్ట్ లభించింది. ఇప్పుడు ఒక్కో గ్రేడ్‌లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం:

A+ గ్రేడ్

  • విరాట్ కోహ్లీ

  • రోహిత్ శర్మ

  • జస్‌ప్రీత్ బుమ్రా

  • రవీంద్ర జడేజా

A గ్రేడ్ 

  • మహ్మద్ సిరాజ్

  • కేఎల్ రాహుల్

  • శుభ్‌మాన్ గిల్

  • హార్దిక్ పాండ్యా

  • మహ్మద్ షమీ

  • రిషబ్ పంత్

B గ్రేడ్ 

  • సూర్యకుమార్ యాదవ్

  • కుల్దీప్ యాదవ్

  • అక్షర్ పటేల్

  • యశస్వి జైస్వాల్

  • శ్రేయస్ అయ్యర్

C గ్రేడ్ 

  • రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్

  • వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు సామ్సన్, అర్ష్‌దీప్ సింగ్

  • ప్రసిద్ధ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్

  • నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్

  • వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

ఇషాన్ కిషన్‌కు రెండో అవకాశం

క్రమశిక్షణ సమస్యలతో ముందుగా కాంట్రాక్ట్‌ నుంచి తప్పించబడిన ఇషాన్ కిషన్‌కు, మళ్లీ అవకాశమిచ్చింది BCCI. ఆటపై కట్టుబాటుతో పాటు ప్రవర్తనపై కూడా మెరుగుపడతానన్న హామీతో అతనికి C గ్రేడ్ కేటాయించారు.

  • సూర్యకుమార్ Yadav, టీ20 కెప్టెన్ అయినా, B గ్రేడ్‌లో ఉన్నారు

  • హార్దిక్ పాండ్యా, సిరాజ్, KL రాహుల్, పంత్ లాంటి వారు A గ్రేడ్‌లో ఉన్నారు

  • కొత్తగా జాబితాలోకి వచ్చిన యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చారు

గ్రేడ్ ప్రకారం వార్షిక జీతం ఎంత అందిస్తారు (గత సంవత్సరం ఆధారంగా)

ప్రస్తుతం ఈ సంవత్సరం జీతం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనిలో కూడా మార్పు ఉండే అవకాశం ఉంది.

  • గ్రేడ్ A+: సంవత్సరానికి రూ. 7 కోట్లు

  • గ్రేడ్ ఏ: సంవత్సరానికి రూ. 5 కోట్లు

  • గ్రేడ్ బీ: సంవత్సరానికి రూ. 3 కోట్లు

  • గ్రేడ్ సీ: సంవత్సరానికి రూ. 1 కోటి

Follow us on , &

ఇవీ చదవండి