Breaking News

జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టుల హతం

జార్ఖండ్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగినా ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి.


Published on: 21 Apr 2025 10:00  IST

జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో ఈరోజు (ఏప్రిల్ 21) ఉదయం భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

ఘటన స్థలంలో సీఆర్పీఎఫ్ (కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్) బలగాలు, జార్ఖండ్ పోలీసులు కలిసి ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

మృతుల వివరాలను గుర్తించే పని కొనసాగుతోంది. వారు ఏ ప్రాంతానికి చెందినవారో అనే విషయంపై విచారణ మొదలైంది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల సంహారానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగానే ఈ కూంబింగ్ ఆపరేషన్‌ జరగింది.

ఈ ఘటనలో ఎస్‌ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలూ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి