Breaking News

వాహనాలకు హారన్లుగా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం

ఇకపై వాహనాల హారన్లు తబలా, వయలిన్, హార్మోనియం, ఫ్లూట్ లాంటి భారతీయ వాయిద్యాల శబ్దాలతో మారుమోగనున్నాయి.


Published on: 22 Apr 2025 16:26  IST

కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ వినూత్న ఆలోచనను దేశ ప్రజల ముందుంచారు. రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాల్లో ప్రస్తుతం వినిపించే హారన్ శబ్దాల స్థానంలో భారతీయ సంగీత వాయిద్యాల స్వరాలు వినిపించేలా చట్టం తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

నవభారత్ టైమ్స్ 78వ వార్షికోత్సవంలో గడ్కరీ మాట్లాడారు. దేశంలోని వాహనాల హారన్లు ఇకపై తబలా, వయలిన్, హార్మోనియం, ఫ్లూట్ లాంటి భారతీయ వాయిద్యాల శబ్దాలతో మారాలని ఉద్దేశ్యంతో చట్టం రూపొందిస్తున్నామని తెలిపారు. ఇవి వినడానికి కూడా మృదువుగా, హాయిగా ఉండడం వల్ల ప్రయాణికులకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.దేశంలో వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం సుమారు 40 శాతం వరకూ ఉంటుందని చెప్పారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఎథనాల్‌, మిథనాల్ ఆధారిత ఇంధన వాహనాలను ప్రోత్సహిస్తున్నదని వివరించారు.

భారత్ ఆటోమొబైల్ రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని గడ్కరీ హైలైట్ చేశారు. 2014లో రూ.14 లక్షల కోట్ల విలువ కలిగిన ఈ రంగం ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. జపాన్‌ను దాటించి, ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచిన ఘనత భారత్‌దని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి