Breaking News

పహల్గాం దాడికి ప్రతీకారం – ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం కూంబింగ్ ఆపరేషన్

పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి తృటిలో తప్పించుకున్న సైనికులు.


Published on: 25 Apr 2025 10:35  IST

శుక్రవారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో ఉగ్రవాదులతో భద్రతా దళాలు ఎదురెదురుగా గట్టిగా ఢీకొన్నాయి. కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు, భద్రతా సిబ్బంది సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దాని సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు.సైనికులు కూడా సమాధానంగా తక్షణమే ఎదురు కాల్పులు చేసారు. దాదాపు కొన్ని గంటలపాటు కాల్పులు జరగగా,మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు.ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు భారత ఆర్మీ పేర్కొంది.

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత సైన్యం జమ్మూ కాశ్మీర్‌లో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. బిజ్‌బెహరా, త్రాల్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగగా, బైసరన్ లోయ నరమేధానికి పాల్పడ్డ వారిని లక్ష్యంగా తీసుకుంది. ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నట్లు అనుమానిస్తున్న పుల్వామాలోని మోంఘమాకు చెందిన ఆసిఫ్ షేక్ ఇంటిని, బిజ్‌బెహారాలోని అదిల్ థోకర్ ఇంటిని సైనిక బలగాలు ఐఈడీ బాంబులతో ధ్వంసం చేశాయి.

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన స్థానిక కమాండర్‌గా ఆసిఫ్ పనిచేస్తున్నట్టు సమాచారం. అదిల్ థోకర్ 2018లో పాకిస్తాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ పొందాడని, తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చి మళ్లీ ఉగ్ర కార్యకలాపాల్లో చేరినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. అదిల్ పై సుదీర్ఘకాలంగా నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి