Breaking News

పల్లవి తో ఇక్కడ జరిగినదంతా మోదీకి వెళ్లి చెప్పుకో అన్నా ఉగ్రవాదులు...

నా భర్తను నా కళ్ల ముందే హత్య చేశారు. నన్ను కూడా చంపేయండి అని వేదనతో ఉగ్రవాదులకు చెప్పిన పల్లవి.


Published on: 23 Apr 2025 17:06  IST

పహల్గాం/న్యూఢిల్లీ: పర్యాటకంగా కశ్మీర్‌కి వెళ్లిన కర్ణాటక కుటుంబం జీవితాన్ని ఊహించని దాడి చీల్చేసింది. షిమొగా జిల్లా చెందిన మంజునాథ్ తన భార్య పల్లవి, కుమారుడు అభిజయ్‌తో కలిసి పహల్గాం సందర్శనలో పాల్గొన్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు.ఈ ఘటనలో మంజునాథ్‌ను నేరుగా కాల్చి చంపేశారు.

"నా భర్తను నా కళ్ల ముందే హత్య చేశారు. నన్ను కూడా చంపేయండి అన్నాను," అని పల్లవి వేదనతో చెప్పారు. అయితే, ఉగ్రవాదుల్లో ఒకడు ఆమెకు స్పందిస్తూ ఇలా అన్నాడట – "మేము నిన్ను చంపం... ఇక్కడ జరిగినదంతా మోదీకి వెళ్లి చెప్పు."

ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పల్లవిలాంటి బాధితుల వేదనల మాటలు వినగానే గుండె ఉలిక్కిపడుతుంది. ఈ అమానవీయ దాడిపై ప్రజల గుండెల్లో కోపం ఉప్పొంగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి