Breaking News

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

ఏప్రిల్ 9వ తేదీ నుంచి కొత్త సుంకాల విధానం అమలు.చైనా ఉత్పత్తులపై మొత్తం 104 శాతం సుంకాల భారం


Published on: 09 Apr 2025 12:14  IST

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించబడ్డాయి. ఈ నిర్ణయం ప్రకారం, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై మొత్తం సుంకాలు 104 శాతానికి పెరిగాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

చైనాపై ఈ చర్యలు తీసుకునే ముందు అమెరికా సుంకాలను తగ్గించడానికి గడువు ఇచ్చినప్పటికీ, చైనా నుంచి ఎటువంటి స్పష్టమైన స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి కొత్త సుంకాల విధానం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఏప్రిల్ 2న ట్రంప్ “లిబరేషన్ డే” పేరుతో పలు దేశాల ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించారు. ఇందులో చైనా కూడా ఉంది. ఆ సమయంలో చైనా దిగుమతులపై 34 శాతం అదనపు సుంకం విధించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చైనా, అదే స్థాయిలో అమెరికా వస్తువులపై కూడా 34 శాతం సుంకాలు విధించనుందని ప్రకటించింది.

దీనిపై ట్రంప్‌ ఫైర్ అయ్యాడు. చైనా తామేసిన ప్రతీకార చర్యలను వెనక్కు తీసుకోవాలని మార్చి 8 వరకు గడువు ఇచ్చారు. లేదంటే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాత్రం ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోలేదు. దాంతో అమెరికా మరో 50 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది.ఈ విధంగా చూస్తే, ఇప్పుడు చైనా ఉత్పత్తులపై మొత్తం సుంకాల భారం 104 శాతానికి పెరిగింది. ఇది చైనా ఉత్పత్తులపై భారీ ప్రభావం చూపనుంది. 

ఇలాంటి పరిణామాల దృష్ట్యా, రెండు దేశాల మధ్య వాణిజ్య సంఘర్షణ మరింత తీవ్రమవడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి