Breaking News

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు: KCR


Published on: 10 Nov 2025 12:09  IST

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి