Breaking News

16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో హాల్ట్‌


Published on: 14 Nov 2025 12:02  IST

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో ప్రత్యేకంగా హాల్టింగ్‌ ఏర్పాటు చేసింది. జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ సదుపాయం ప్రయాణికులకు అందుబాట్లో ఉంటుందని దక్షిణమధ్యరైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌(South Central Railway CPRO Sridhar) తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి