Breaking News

‘ప్యాసింజర్‌’ సమస్యలు తీరేనా..?


Published on: 02 Jan 2026 17:05  IST

గుంతకల్లు నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ డే ప్యాసింజరు రైళ్లు పునరుద్ధరించని కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్ల కిందట గుంతకల్లు-ఎగ్మోర్‌ (చెన్నై), యశ్వంతపూర్‌-విజయవాడ (56503/04), గుంతకల్లు-గుల్బర్గా ప్యాసింజరు రైళ్లు నడిచేవి. కరోనా సీజన్‌ పూర్తయిన తర్వాత పలు ప్యాసింజరు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరించినా ఈ ప్యాసింజరు రైళ్లను పట్టాలెక్కించలేదు. గుంతకల్లు-తిరుపతి, గుంతకల్లు-కాచిగూడ, గుంతకల్లు-రాయచూరు ప్యాసింజర్లను మాత్రమే పునరుద్ధరించారు.

Follow us on , &

ఇవీ చదవండి