Breaking News

ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు


Published on: 08 Jan 2026 15:44  IST

‘నన్ను కాదని, నాకు తెలియకుండా, ప్రొటోకాల్‌ లేని ఎవరి చేతనో ప్రభుత్వ భవనాలకు భూమిపూజ చేయిస్తారా? మీకు సిగ్గలేదా? మీరు అధికారులా.. పాలేగాళ్లా. ఎవరికోసమో బానిసలుగా పనిచేయొద్దు. భయపడి బతకొద్దు’ అంటూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆదిమూలం ధ్వజమెత్తారు. వరదయ్యపాలెంలో బుధవారం జరిగిన ప్రజాదర్బార్‌లో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇంకోసారి ప్రొటోకాల్‌ విస్మరించి అనధికార వ్యక్తుల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే హైకోర్టులో పిటిషన్‌ వేస్తానని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి