Breaking News

రాష్ట్రంలో అల్మాంట్‌ కిడ్‌ సిరప్‌ లేదు


Published on: 12 Jan 2026 15:52  IST

చిన్నారుల్లో జలుబు తగ్గించేందుకు ఉపయోగించే ‘అల్మాంట్‌ - కిడ్‌’ సిరప్‌ రాష్ట్రానికి సరఫరా జరగలేదని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. బిహార్‌కు చెందిన ట్రిడస్‌ రెమెడీస్‌ సంస్థ తయారు చేసి ఏఎల్‌-24002 బ్యాచ్‌ సిర్‌పలో మోతాదుకు మించి ఇథలీన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు కోల్‌కతాలోని ల్యాబ్లో పరీక్షించగా తేలిన ట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్‌, రిటైర్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించామని ఆదివారం వెల్లడించింది. ప్రైవేటు మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు జరగడం లేదని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి