Breaking News

పండుగ రద్దీ వేళ 12 జన్‌సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు..


Published on: 12 Jan 2026 17:53  IST

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారులు మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖ- విజయవాడ మధ్య 12 జన్‌సాధారణ్‌ (అన్‌ రిజర్వుడ్‌) రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి. విశాఖ - విజయవాడ జన్‌సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ (08567) రైలు నిర్ణీత తేదీల్లో విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి