Breaking News

డేటా మిస్‌మ్యాచ్‌.. నిజమైన ఓటర్లకు తిప్పలు


Published on: 12 Jan 2026 18:10  IST

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్‌ ప్రక్రియలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఎస్‌ఐఆర్‌ మొదలు సీఈసీకి దీదీ లేఖ రాయడం ఇది ఐదోసారి.

Follow us on , &

ఇవీ చదవండి