Breaking News

జైళ్లలో 12శాతం పెరిగిన ఖైదీలు


Published on: 13 Jan 2026 16:10  IST

రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 11.8 శాతం పెరిగిందని జైళ్లశాఖ 2025 వార్షిక నివేదిక పేర్కొంది. ఈ నివేదికను చంచల్‌గూడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా విడుదల చేశారు. ఐజీలు మురళీబాబు, రాజేష్‌, డీఐజీలు శ్రీనివాస్‌, సంపత్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.గత ఏడాది జైళ్లకు వచ్చినవారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వయస్సు వారు ఉండగా ఈ వయస్సు ఖైదీల్లో 13.31శాతం పెరుగుదల నమోదైంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement