Breaking News

ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు..


Published on: 13 Jan 2026 16:59  IST

ఏపీ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక ARETని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. ధరల్లో సమానత్వం పునరుద్ధరణ.

Follow us on , &

ఇవీ చదవండి